TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఇవాళ రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. ఈ రోజు రూ.1.57 కోట్ల ఆదాయం, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.27, 43, 220 ఆదాయం వచ్చింది. 78,200 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవంబర్ 2022న రూ.1.16 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.