AP: పాడేరులో ‘జన జాతీయ గౌరవ దివాస్’ పేరుతో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్.. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఈ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరుకానున్నారు.