ప్రకాశం: వెలిగండ్ల మండలం రామగోపాలపురంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవిరెడ్డి రామిరెడ్డి తన సొంత నిధులతో 40 ఇళ్లకు నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. TDP మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్ర భూపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి మోటర్ ఆన్ చేసి నీటి సరఫరాను ప్రారంభించారు. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి తీరింది.