KDP: సీఎం చంద్రబాబు ఈ నెల 19న జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. PM కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.