TG: సౌదీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో సౌదీలో కాన్సులేట్ వాళ్లతో సంప్రదిస్తున్నామని తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వాళ్ల పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని వెల్లడించారు.