TG: కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కేటాయించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.