CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిత్యాన్నదానానికి సోమవారం కడప జిల్లా పులివెందలకు చెందిన తిరుమలరెడ్డి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఈమేరకు చెక్కుని టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ తీర్ధప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహూకరించారు.