ELR: కొయ్యలగూడెంలో ఈనెల 18న సీపీఐ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ ఆత్మగౌరవ సభ’ నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ తాడిగడప ఆంజనేయరాజు తెలిపారు. దళిత, గిరిజన, మైనారిటీలపై దాడులను నిరసిస్తూ ఉదయం 10 గంటలకు గణేష్ సెంటర్లో ఈ సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.