NZB: ప్రజల సౌకర్యార్థం అత్యవసర సమయంలో ఫోన్ చేయడానికి పోలీస్ శాఖ డయల్ 100ను ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా ఫోన్ చేసి సమయం వృథా చేస్తున్నారు. డయల్ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏడు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి సోమవారం తెలిపారు.