KRNL: పత్తికొండ నియోజకవర్గ చెరువులకు నీళ్లు నింపి, పంట కాలువల ద్వారా సాగునీరు అందించకపోతే మరో ఉద్యమం చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ గురువారం హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. పంట నష్టపరిహారం, రోడ్ల మరమ్మతులు, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆయన డిమాండ్ చేశారు.