హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని జయగిరిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని పేర్కొన్నారు.