NTR: గంపలగూడెం మండలం నార్కింపాడు శివారులో పత్తి లోడుతో వెళ్తున్న ఓ అశోక్ లేలాండ్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించారు.