టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈనెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు నడవనుంది. ఈ శుభ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.