WGL: నల్లబెల్లి మండల పరిధిలోని గత మూడు రోజుల నుంచి కురుస్తున్న దట్టమైన పొగ మంచుకు జాగ్రత్తలు పాటించాలని గురువారం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఉదయం పూట ప్రయాణాలు చేసే ప్రయాణికులు తప్పనిసరి హెల్మెట్, షెటర్స్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. పొగ మంచు దృష్ట్యా ఉదయం వేళలో ప్రయాణం చేయవద్దని ప్రజలను కోరారు.