TG: సమావేశాలు, వ్యాపారాల కోసం దేశవిదేశాల నుంచి HYD వచ్చిన వారి కోసం పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీయుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఒకే యాత్రలో పని, పర్యాటకం అందించే ఉద్దేశంతో ‘తెలంగాణను చూడండి’ అనే నినాదంతో ‘HYD పిలుస్తోంది.. పని చేయడానికైనా, పర్యటించడానికైనా, ఆశ్చర్యాలకైనా’ అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకొచ్చింది.