గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో స్టార్ బాక్సర్ తెలుగమ్మాయి నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో మెరిసింది. 51 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5-0తో గెలుపొందింది. అలాగే, మినాక్షి హూడా(48 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు), అరుంధతి(70 కిలోలు), నూపుర్ శెఓరన్(80+ కిలోలు) స్వర్ణాలు సాధించారు.