W.G: ఆచంట విద్యుత్ సంస్థ కార్యాలయంలో ఈ నెల 21న వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం జరుగనుందని C.G.R.F ఛైర్ పర్సన్, రిటైర్డ్ జడ్జి బి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 జరిగే ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను నేరుగా హాజరై ఫిర్యాదులు సమర్పించి పరిష్కారం పొందవచ్చని ఆయన తెలిపారు.