నల్లగొండలో భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ నరసింహారాజు నేతృత్వంలో గురువారం మిల్లింగ్ రైస్ మరియు వానాకాలం ధాన్య సేకరణ పై సమావేశం జరిగింది. పట్టణంలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఆర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.