JGL: మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన పున్న లచ్చవ్వ (59) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా మృతురాలు తన సోదరుడి ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఇంటిబయట గడ్డికి నిప్పుపెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.