మహారాష్ట్రలో హిందీ-మరాఠీ భాషా వివాదం కారణంగా 19 ఏళ్ల విద్యార్థి అర్ణవ్ జితేంద్ర ఖైరే ఆత్మహత్య చేసుకున్నాడు. లోకల్ ట్రైన్లో హిందీలో మాట్లాడినందుకు 4-5 మంది యువకులు అర్ణవ్పై దాడి చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.