ప్రకాశం: పొదిలి మండలంలోని కొండయ్య పాలెంలో మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నారాంబాబు కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.