KRNL: ‘ఈ-హాస్పిటల్’ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కర్నూలు సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు ఆదేశించారు. GGHలో ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్లో HODల సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు మరింత సమర్ధవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఓపీ, ఐపీ, డిశ్చార్జ్, ఫార్మసీ డేటా ఎంట్రీని కచ్చితంగా నిర్వహించాలన్నారు.