CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను నూతనంగా నియమితులైన ప్రభుత్వ ఖాజీలు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు నియోజకవర్గానికి ముగ్గురు నూతన ఖాజీలను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఖాజీల నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే వారికి అందించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు, నాయకులు MLAను సత్కరించారు.