TG: తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో ఫెస్టివల్లో గవర్నర్ దంపతులు, CM రేవంత్ పాల్గొన్నారు. ఈ వేడుక ఈశాన్య రాష్ట్రాలతో మనకున్న ఐక్యతకు స్ఫూర్తని CM అన్నారు. ‘దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలది కీలక పాత్ర. మన మధ్య అనుబంధం కొనసాగాలి. తెలంగాణ మీకు మరో ఇల్లులాంటిది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశం, ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలి’ అని అన్నారు.