CTR: ప్రతి నిరుపేద మహిళ సొంత ఇంటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని 445 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ గృహాల నిర్మాణం కోసం సుమారు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.