TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల వద్ద కృష్ణానదిపై రెండు కొండల మధ్య రూ.1083 కోట్లతో చేపట్టిన తీగల వంతెనను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎంపీకి వివరించారు. కాగా, ఈ వంతెన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది.