ADB: విద్యార్థులు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చునని ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ వసతి గృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు.