KDP: సిద్దవటం మండలం వంతాటిపల్లి గ్రామ సమీపంలో వెలసిన నిత్య పూజయ్యస్వామి కోనలో అపరిశుభ్ర ప్రాంతాలను శుక్రవారం తొలగింపు పనులను చేపట్టినట్లు ఆలయ ఛైర్మన్ జంగిటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వన్య ప్రాణుల సంరక్షణకై పంచ లింగాల గుడివద్ద ఉన్న ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలను కూలీలతో పూర్తిగా తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లించామన్నారు.