BHNG: రామన్నపేట పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు ఇవ్వాళ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట గ్రామంలో పేకాటను ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు వారిని పట్టుకొని వారి నుంచి 3 మొబైల్ ఫోన్లను, రూ.1,820 స్వాదినం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.