HYD: రవాణా శాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలన్నారు.