GNTR: రైతుబజార్లకు వచ్చే వినియోగదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి కొత్తపేటలోని ఎల్ఐసీ ఆఫీస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మొదట మంత్రి కూరగాయలను కొనుగోలు చేసి ప్రారంభించారు.