నెల్లూరు నగరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 22 మంది ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లకు అందజేశారు. ఉద్యోగులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని శుక్లా తెలిపారు.