ATP: గుంతకల్లు మండలం తిమ్మాపురంలో జరిగిన 69వ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో నేమకల్లు ZPHS విద్యార్థి మంజునాథ్ సత్తా చాటాడు. అండర్ -19 విభాగంలో జిల్లాలో రెండో స్థానం సాధించాడు. తద్వారా 8వ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందాడు. ఈ విజయం సాధించినందుకు ఎంఈవోలు మల్లికార్జున, వీరన్న, సర్పంచ్ పరమేష్లు విద్యార్థిని అభినందించారు.