సిద్దిపేట పట్టణ పారుపల్లి వీధికి చెందిన కుర్తివాడ బుచ్చమ్మ (92) మృతి చెందగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించారు. కుర్తివాడ బుచ్చమ్మ మృతి చెందినట్లు తెలియగానే వాసవి క్లబ్ నాయకులు ఆమె కుమారుడు కిషన్‌ను సంప్రదించి వాసవి ఐ బ్యాంక్ హైదరాబాద్ సహకారంతో నేత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంప కృష్ణమూర్తి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.