RR: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను శనివారం కలిశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఉద్యమకారుల హామీలను నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు.