కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డోంగ్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిర మహిళా శక్తి చీరలను స్థానిక నాయకులు, అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రజా ప్రభుత్వం ఈ చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు.