E.G: రాజమండ్రి నగర స్వచ్ఛతను మరింత బలపర్చేందుకు, ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట ఉండటం తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా శనివారం పేర్కొన్నారు. మెయిన్ రోడ్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రహదారులు & డ్రైనేజీలను నిత్యం శుభ్రపరచడం, సెంట్రల్ డివైడర్లలో చెత్త పేరుకుపోకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు.