VZM: కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తాయని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఇవాళ రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించాయి. లేబర్ కోడ్ల నోటిఫై ఉత్తర్వులను తీవ్రంగా ఖండించిన కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.