కడప: శనివారం కురిసిన స్వల్ప వర్షానికే కడపలోని ఐటీఐ సర్కిల్, సాయిబాబా స్కూల్ పరిసరాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.