WGL: తెలంగాణ టీచర్స్ యూనియన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూక్య హరిలాల్ను ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు మునిగాల మణిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆదర్శన్ రెడ్డి నియమించారు. వర్ధన్నపేట మండలం జడ్పీ హెచ్ఎస్ ల్యాబర్తి పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన సంఘసేవ, ఉపాధ్యాయ సమస్యలపై చురుకైన పాత్రకు గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించారు.