MDK: అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ప్రసన్న కుమార్తో పాటు రెవెన్యూ అధికారులకు సూచిచించారు. ఇకపై జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా BRS నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారన్నారు. అందులో హరీష్ రావు పాత్ర సైతం ఉందని ఆరోపించారు.