SRCL: అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బోయినపల్లి రైతు వేదికలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.