MBNR: ఇళ్లలో పని చేసుకునే కార్మికులు ఈ శ్రమ్ కార్డుల ప్రయోజనాలు పొందాలని జిల్లా ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ ఊరగుట్టలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శ్రమ్ కార్డు పొందిన వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురైతే తగిన ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.