KNR: మహిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ పునరుద్ఘాటించారు. శనివారం శంకరపట్నం మండల కేంద్రంలోని వెలుగు మండల సమాఖ్య ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.