W.G: భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భక్తులు బంగారం విరాళాలు సమర్పించారు. పట్టణానికి చెందిన మానేపల్లి సత్యవతి 8 గ్రాములు, ఇరగవరం మండలం కత్వపాడుకు చెందిన కొండలరావు 2 గ్రాములు బంగారాన్ని అందజేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు వేద ఆశీర్వచనాలు అందించారు.