సత్యసాయి: గోరంట్ల మండలం చింతలపల్లిలో మంత్రి సవిత ఆదేశాల మేరకు శనివారం ఇంటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇల్లు లేని పేద వాళ్ల ఇంటికి వెళ్లి సర్వే చేయడం ప్రారంభించారు. త్వరలో ఇంటి నిర్మాణాలు చేపడతామని మల్లికార్జున తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాజారెడ్డి, అంజి పాల్గొన్నారు.