MDK: నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంటలో ఇవాళ మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించి మద్దతు ధరను పొందాలని సూచించారు. అలాగే తిప్పనగుల్లలోని మొక్కజొన్న పంట సాగును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఈవో గోపాల్ రెడ్డి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.