ATP: గుత్తి సబ్ జైలును జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాజశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని రికార్డులను, అన్ని విభాగాలను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఖైదీలకు సూచించారు.