SKLM: జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జె.ఆర్ పురం ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ విస్తృతంగా కిరణా షాపులు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కడైనా జరిగితే ప్రజలు సమాచారమివ్వాలని ఆయన తెలిపారు.