AKP: పాయకరావుపేట మండలంలో ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏఓ ఆదినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి వంగలపూడి అనిత పెదరామభద్రపురం గ్రామంలో రైతు వారోత్సవాలను ప్రారంభించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.